ఎంత మంచి ఓనర్.. రెంట్‌దేముంది భయ్ అంటూ..

ఎంత మంచి ఓనర్.. రెంట్‌దేముంది భయ్ అంటూ..

కరోనా తమకి ఎక్కడ అంటుకుంటుందో అని బాధితులకి సేవలు అందిస్తున్న వారిని ఇళ్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్స్ గురించి వింటున్నాము. కానీ మానవత్వం వున్న మంచి మనుషులు కూడా ఉన్నారనడానికి నిదర్శనంగా యూపీ నోయిడాకు చెందిన ఇంటి యజమాని అద్దెను కూడా మాఫీ చేశారు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అంటూ వారికి వంటకు కావలసిన సామాగ్రిని కూడా అందిస్తున్నారు. హౌస్ ఓనర్ కుశాల్ పాల్‌‌కు ఉన్న ఇళ్లలో 50 మంది నివస్తున్నారు. వారి నుంచి నెలవారీ పెద్ద మొత్తంలో అద్దె వస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో పనిలేక రోజువారీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అద్దె వసూలు చేయడం భావ్యం కాదని భావించి రెంట్ మాఫీ చేశారు కుశాల్.

Tags

Read MoreRead Less
Next Story