మద్యం అక్రమ రవాణా.. అడ్డంగా దొరికిన సీఐ
దేశం మరియు ప్రపంచమంతా కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతుంటే ఓ బాధ్యత కలిగిన పోలీస్ అధికారి మాత్రం మద్యం అక్రమ రవాణా చేస్తున్నాడు.. తూర్పు గోదావరి జిల్లా ఎక్సయిజ్ సీఐ రెడ్డి త్రినాధ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన స్నేహితుడితో కలిసి అనధికారికంగా మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. కుతుకులూరు మారుతినగర్ దగ్గర ఆయన కారును గ్రామస్థులు నిర్బంధించారు.
ఎక్సయిజ్ సీఐ తన సొంత వాహనంలో అనేక ఫుల్ మద్యం కేసులు తన స్నేహితుడి కారులో మరికొన్నిమద్యం కేసులను తరలిస్తు దొరికిపోయారు. ఈ సమయంలో వారు పారిపోయేందుకు కూడా ప్రయత్నించారు.. కానీ గ్రామస్థులు అడ్డుకున్నారు. మరోవైపు సీఐ రెడ్డి త్రినాధ్ ను సస్పెండ్ చేసే వరకు కదిలేది లేదని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com