ఓ మారు మూల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా.. రేణూ

లాక్‌డౌన్.. మనసులోని భావాలు బయటకొస్తున్నాయి. ఎప్పుడో దిగిన ఫొటోలు,అప్పుడెప్పుడో తీసిన వీడియోలు అన్నీ ఒకసారి రివైండ్ చేసుకునే అవకాశం వచ్చింది. కొందరికి ఖేదం, మరి కొందరికి మోదం అంటే ఇదేనేమో. పిల్లలు కాలేజీకి వెళ్లిపోతే ఓ మారు గ్రామంలో వ్యవసాయం చేయాలని అక్కడ కూరగాయలను పండించాలని, పిల్లులు, కుక్కలు, పశువులను పెంచాలని నాకు కోరిక. ఇష్టమైన పుస్తకాలు, చదవడం కవితలు రాయడం.. వావ్ జీవితంలో ఇంతకంటే ఆనందం ఏంవుంటుంది. ఇలా నేను అనుకున్నవి జరిగితే అదే నాకు స్వర్గం అవుతుంది. త్వరలో ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నాను అని రేణూ పేర్కొన్నారు. షూటింగ్‌లు లేని తరుణంలో ఇంటికే పరిమితమైన రేణూ ఇన్‌స్టాగ్రాంలో తన మనసులో మాటని రాసుకొచ్చారు. ఆ మధ్యరేణూ దేశాయ్ తన టీమ్‌తో కలిసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఆ పని ఆగిపోయింది. అక్కడి చిన్నారులతో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ, అప్పుడు తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com