15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి..

ఖాళీగా ఉండేసరికి అందరికీ అన్నీ గుర్తుకొస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. పాత విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను ఎన్ని కష్టాలు పడింది.. ఇప్పుడెలా మారిందీ అన్నీ వివరించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబై ట్రైన్ ఎక్కేసింది 15 ఏళ్ల వయసులోనే. సినిమాల్లోకి రావాలనే కోరిక తనని ఒకచోట నిలవనీయలేదు. ఆ సమయంలోనే డ్రగ్స్‌కి అలవాటు పడ్డాను. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను.
నాకొక మంచి స్నేహితుడు పరిచయమై యోగా, ధ్యానంల గురించి వివరించారు. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. అన్యాయాన్ని సహించను. ముక్కుసూటి మనస్తత్వం అన్నా, కోపిష్టి అన్నా నన్ను నేను మార్చుకోవడానికి అవి ఉపయోగపడ్డాయని భావిస్తాను. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల అందరూ ఇళ్లలో కూర్చుని బోర్ ఫీలవుతున్నారు. కరోనాని కంట్రోల్ చేయాలంటే ఇది తప్పదు. అయినా ఏవైనా చెడ్డ రోజులు వచ్చాయంటే ముందు మంచి రోజులు ఉన్నాయేమో, పాజిటివ్‌గా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుందని వీడియోలో వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com