తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పాజిటివ్ గా నమోదైన కేసులలో 11 మంది కోలుకున్నట్టు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పదకొండు మందికి పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినట్టు చెప్పారు. మరో మూడు రోజులపాటు పరిశీలనలో ఉంచుతామని చెప్పారు. అలాగే కరోనా ఆసుపత్రి కోసం కింగ్ కోటి ఆసుపత్రిని సిద్ధం చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. అక్కడ 350 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశామన్నారు.

మొత్తానికి కరోనా టెన్షన్ ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ ట్వీట్ కొంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు 67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వారిలో ఒక వృద్దుడు చనిపోయారని తెలిపారు. అయితే అతనికి చనిపోయిన తరువాత వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఇక పోతే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిర్వహిస్తుండడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 145 మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేశారు.

Tags

Next Story