లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం

లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం అమలవుతోన్న లాక్ డౌన్ వచ్చే నెల 14 వరకే అని.. 21 రోజులే అని స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లాక్ డౌన్ పొడగించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని విపరీతంగా ప్రచారం జరుసుగుతోంది. దాంతో ప్రజలు ఈ వార్తలను నిజమనుకొని అయోమయంలో పడ్డారు.

అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ గడువు పెంచడం లేదని.. పెంచుతారన్న వదంతులు అవాస్తమని స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొంది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అందులో ప్రస్తుతానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ 21 రోజులేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు లాక్‌డౌన్‌ పెంచుతున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. ఇదిలావుంటే భారత్‌లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 29 మంది మృత్యువాత పడిన సంగతి తలిసిందే.

Tags

Next Story