కరోనా వైరస్ : కరాచీలో హిందువుల పట్ల వివక్ష.. సరుకులు వారికి మాత్రమే..

కరోనా వైరస్ : కరాచీలో హిందువుల పట్ల వివక్ష.. సరుకులు వారికి మాత్రమే..

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ పాకిస్థాన్ లో హిందువుల పట్ల వివక్ష కొనసాగుతోంది. కేవలం ముస్లింలకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణి చేస్తూ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారు.. కరాచీ నగరం, సింధ్ ప్రావిన్స్‌లో సుమారు 5 లక్షల మంది దాకా హిందువులు ఉన్నారు.. వీరంతా కరాచీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో సింధ్ ప్రావిన్స్ లోని వలసల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు లేకపోవడంతో డబ్బులు లేక తినడానికి అవసరమైన సరుకులు కూడా కొనుక్కోలేకపోతున్నారు.

ఈ క్రమంలో వలస కార్మికులకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణి చేసింది, కాని కరాచీలో హిందువుల పట్ల వివక్ష చూపించారు ముస్లిం అధికారులు. ఇటీవల పంపిణి చేసిన రేషన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు కేవలం ముస్లిం ప్రజలకు మాత్రమే పంపిణి చేశారు.. హిందువులను ఒట్టి చేత్తో వెనక్కి పంపించేశారు. దాంతో వారు తీవ్ర నిరాశలో వెనుదిరిగారు. అయితే వీరి పరిస్థితి గమనించిన రాజకీయ కార్యకర్త డాక్టర్ అమ్జాద్ అయూబ్.. భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధ్ ప్రావిన్స్‌లోని హిందువుల కోసం రేషన్ మరియు ఇతర ముఖ్యమైన సరుకులను రాజస్థాన్ ద్వారా పంపాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story