వలస కార్మికులకు ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ ఇవ్వాలి: ప్రియాంక గాంధీ

వలస కార్మికులకు ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ ఇవ్వాలి: ప్రియాంక గాంధీ

కరోనా మహమ్మారి వలన అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వలస కార్మికులు పనులు లేక.. తినడానికి తిండి లేక సొంత గ్రామాల బాటపట్టారు. వీరి సమస్యలని ప్రస్తావిస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ టెలికాం సంస్థలకు లేఖలు రాశారు. వలస కార్మికులకు ఉచితంగా మొబైల్‌ సర్వీసులు అందించాలని కోరారు. లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు భోజనం, వసతి సౌకర్యాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వారి వద్ద ఫోన్లలో రీఛార్జ్‌లకు కూడా డబ్బులు ఉండవు. నెల రోజుల పాటు వారికి ఉచితంగా అవుట్‌గోయింగ్‌ ఇవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Tags

Next Story