వారి భద్రతా ఖర్చులతో మాకు సంబంధం లేదు: ట్రంప్

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ప్రిన్స్ దంపతులు కాలిఫోర్నియా వచ్చినట్టు వస్తున్న వార్తలపై ట్విటర్లో స్పందిచిన ట్రంప్.. ‘‘బ్రిటన్ అన్నా, రాణి అన్నా తనకు చాలా ఇష్టమని.. వారితో తనకు గొప్ప స్నేహం ఉందని అన్నారు. రాజ కుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని విన్నాం.. కానీ.. ఇప్పుడు వారు కెనడాను వీడి అమెరికా వచ్చారు. అయితే వారి భద్రత ఖర్చులను అమెరికా చెల్లించదని.. వాళ్లే చెల్లించాలని స్పష్టం చేశారు.
క్వీన్ ఎలిజబెత్-2 మనవడైన హ్యారీ.. అమెరికా నటి మేఘన్ మార్కెల్‌ను 2018లో వివాహం చేసుకున్నారు. జనవరిలో తమకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలంటూ రాజ కుటుంబం నుంచి విడిపోయిన ఈ దంపతులు కెనడాకి మకాం మార్చారు. అయితే ఈ దంపతులు తమ దేశంలో నివసించడంపై స్పందించిన.. కెనడా ప్రభుత్యం.. వారి భద్రతా ఖర్చులు తాము చెల్లించబోమని తెలిపింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అదే తరహాలో స్పందించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com