ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. అక్కడ మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23 కు చేరింది. రాజమహేంద్రవరానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.. అలాగే కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కూడా పాజిటివ్ అని తేలింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి హెల్త్ బులిటెన్ కూడా జారీ అయింది. అయితే వీరి ప్రయాణ చరిత్రపై ఇంకా ఎటువంటి సమాచారం అధికారుల వద్ద లేనట్టు తెలుస్తోంది.

ఆదివారం కూడా రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య 23 చేరుకుంది. అత్యధికంగా విశాఖపట్నంలో 6 కేసులు నమోదు కాగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి , ప్రకాశం జిల్లాల్లో మూడు కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు , కర్నూలు , నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయింది. నెల్లూరులో నమోదైన మొదటి కేసు బాధితుడు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Next Story