కరోనా.. 3 నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లా..

కరోనా.. 3 నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లా..

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్థంభించిపోయినట్లైంది. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రం రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 3 నెలలు మారటోరియం విధించాలని రాష్ట్రాలను కోరింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్ పవర్ కొనుగోలుకు సంబంధించి పేమెంట్ సెక్యూరిటీ మొత్తాన్ని సగానికి తగ్గించాలని, లేట్ పేమెంట్స్‌పై నో చార్జీలు వంటి ప్రయోజనాన్ని కలింగించాలని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story