మీకేం పట్టదా.. హీరోయిన్స్‌పై బ్రహ్మాజీ సీరియస్

మీకేం పట్టదా.. హీరోయిన్స్‌పై బ్రహ్మాజీ సీరియస్

"ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలమవుతోంది. లాక్‌డౌన్ కొందరికి నడుస్తుంది. కానీ అందరి పరిస్థితి అలా కాదే. దినసరి కార్మికులకు ఎంత కష్టం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. అందరికీ సహాయం చేయలేక పోయినా ఇండస్ట్రీనే నమ్ముకుని, ఇండస్ట్రీమీదే ఆధారపడిన కార్మికులు ఎందరో ఉన్నారు. వాళ్లను ఆదుకోవలసిన కనీస బాధ్యత మన మీద ఉంది. సినీ పెద్దలు దానికోసం ఓ ఫండ్‌ చారిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మంది సహృదయంతో స్పందించి తమ వంతు సాయాన్ని అందించారు. కానీ హీరోయిన్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఒక్క లావణ్య త్రిపాఠీ మినహాయించి చారిటీకి నిధులు ఎవరూ ఇవ్వలేదు" అని నటుడు బ్రహ్మాజీ హీరోయిన్స్‌పై విరుచుకుపడుతున్నారు. ముంబై నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఇక్కడ పనిచేస్తున్నారు.. స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు సాయానికి ఒక్కరూ ముందుకు రావడంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. మరి బ్రహ్మాజీ మాటలు వారి చెవిన పడితే ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story