సీసీఎంబీ లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

సీసీఎంబీ లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో సీసీఎంబీ ఇవాల్టినుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి రాగా.. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా అధికారికంగా అనుమతిచ్చింది. అలాగే పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లను అందించేందుకు ఏర్పాట్లను చేసింది. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో మరింత వేగం పెరగనుంది. సీసీబీమ్ కి ఒక్కరోజులోనే 500 పైగా రక్తనమూనాలను పరీక్షించే సామర్ధ్యం ఉంది.

జీవశాస్త్ర పరిశోధనల్లో అగ్రస్థానంలో సీసీఎంబీని కరోనా నిర్ధారణకు వేదికగా వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ అభ్యర్థనకు కేంద్రం ఒకే చెప్పింది. కరోనా వైరస్ నిర్ధారణ తోపాటు వైరస్ జన్యు క్రమంపై కూడా సీసీఎంబీ పరిశోధించనుంది. వైరస్ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా జన్యు క్రమం ఉందా? భౌగోళిక పరిస్థితులను భట్టి మార్పులు ఏమైనా చోటుచేసుకుంటున్నాయా? అనే అంశాలపై సీసీఎంబీ స్టడీ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story