లాక్‌డౌన్ సందర్భంగా విజయ్ మాల్యా ట్వీట్

లాక్‌డౌన్ సందర్భంగా విజయ్ మాల్యా ట్వీట్

బ్యాంకులను మోసగించి విదేశంలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కరోనా వైరస్ లాక్‌డౌన్ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు. కింగ్ ఫిషర్ లో అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్టు సంస్థ అధినేత విజయ్ మాల్యా ట్వీట్ చేశాడు. అయితే ఉద్యోగులను ఇంటికి పంపించలేదని దీనికి ప్రభుత్వ సహాయం కావాలని కోరాడు.. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. అందులో.. 'భారతదేశం మొత్తం దేశాన్ని లాక్ చేయడాన్ని మేము దానిని గౌరవిస్తాము. నా కంపెనీలన్నీ సమర్థవంతంగా కార్యకలాపాలను నిలిపివేశాయి. తయారీ కూడా మూసివేయబడింది. అయితే మేము ఉద్యోగులను ఇంటికి పంపించలేదు. ఇందుకు ప్రభుత్వం సహాయం చేయాలి.

KFA రుణం తీసుకున్న మొత్తంలో 100% బ్యాంకులకు చెల్లించడానికి నేను పదేపదే ఆఫర్లు ఇచ్చాను. బ్యాంకులు డబ్బు తీసుకోవడానికి సిద్ధంగా లేవు మరియు బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్మెంట్లను విడుదల చేయడానికి ED కూడా సిద్ధంగా లేదు. ఈ సంక్షోభ సమయంలో ఆర్ధిక మంత్రి నా విన్నపాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను.' అంటూ ట్వీట్ చేశాడు మాల్యా. కాగా లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా విజయ్ మాల్యా సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story