ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కి ఐదోసారీ కరోనా పాజిటివ్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆమె గత పది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కనికా కపూర్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వరసగా ఐదోసారి కూడా ఈమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది.
ఒకసారి కరోనా సోకిన తర్వాత.. ప్రతీ 48 గంటలకు ఓసారి టెస్ట్ నిర్వహిస్తారు. సాధారణంగా రెండుసార్లు పాజిటివ్ వచ్చినా.. మూడోసారి నెగెటివ్ వస్తుంటుంది. కానీ కనికాను మాత్రం వైరస్ అంత ఈజీగా వదలట్లేదు. ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి.. ఐదోసారి టెస్ట్ చెయ్యగా ఈసారి కూడా కరోనా పాజిటివ్ అనే వచ్చింది. అయితే డాక్టర్లు మాత్రం కనికా ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com