ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మేరీకోమ్

ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మేరీకోమ్

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తమిరి కొట్టేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే ప‌లువురు ప్రముఖులు ఇప్పటికే త‌మ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాల‌ను ప్రక‌టించారు.

అయితే కరోనాపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తోన్న ప్రముఖుల జాబితాలో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ కూడా చేరారు. ఆమె ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించి తన ఉదారతని చాటుకున్నారు.

రాజ్యసభ సభ్యురాలైన మేరీకోమ్ తన స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయిలను కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించారు.

Tags

Read MoreRead Less
Next Story