నారా రోహిత్‌ రూ. 30 లక్షలు విరాళం

నారా రోహిత్‌ రూ. 30 లక్షలు విరాళం

క‌రోనా నిర్మూల‌న‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్రముఖులు ఇప్పటికే త‌మ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాల‌ను ప్రక‌టించారు. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తోన్న సినీ నటుల జాబితాలో నారా రోహిత్‌ కూడా చేరారు.

కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు నారా రోహిత్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు రోహిత్‌ తెలిపారు. మరో రూ. 10 లక్షలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రోహిత్‌ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story