ఎన్‌టీఏ దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదా వేయండి

ఎన్‌టీఏ దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదా వేయండి
X

భారత్ లో రోజురోజుకు ఉదృతమవుతోన్న కరోనా వైరస్ వ్యాధిని దృష్టిలో ఉంచుకొని..

యూజీసీ–నెట్, సీఎస్‌ఐఆర్‌–నెట్, ఇగ్నో పీహెచ్‌డీ, ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్‌ తదితర పరీక్షలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదావేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి(ఎన్‌టీఏ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. దానికి తోడు గడువును వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు మంత్రిని అభ్యర్థించారు. దాంతో గడువును మరో నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పరిస్థితులను సమీక్షించిన తరువాత దరఖాస్తు ప్రక్రియ కోసం తేదీలను ఎన్‌టీఏ ప్రకటించనుంది.

Tags

Next Story