మూడు గ్రహాలు కలుస్తున్నాయి.. ఆ నాలుగు రోజులు బయటకు వద్దు: సింగర్ స్మిత

మూడు గ్రహాలు కలుస్తున్నాయి.. ఆ నాలుగు రోజులు బయటకు వద్దు: సింగర్ స్మిత

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే బయటకు వెళ్లకపోవడం ఒక్కటే పరిష్కారం. వచ్చే వారం రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు సింగర్ స్మిత. వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్న కాలం ఇది. ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడి మీదకు రాహువు వస్తున్నాడు. శని, అంగారకుడు, గురు గ్రహాలు మూడూ కలుసుకోబోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. మార్చి 30 రాత్రి నుంచి ఏప్రిల్ 2 వరకు బయటకు వెళ్లడం మానుకుని ఇంట్లో ఉన్న సరుకులతో సరిపెట్టుకోమని సూచిస్తున్నారు. అలాగే వేడి నీటిలో పసుపు, తులసి, వాము కలిపి ఆవిరి పడితే వైరస్ దరిచేరదని అంటున్నారు. ఇలా చేయడం వలన వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకున్నవారం అవుతామని స్మిత అంటున్నారు.

Tags

Next Story