ఏపీలో 56కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకూ 44 కేసులు నమోదు కాగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. ఇందులో ఏలూరులో 6 , భీమవరంలో 2 , పెనుకొండలో 2 , ఉండి గుండిగోలులో ఒక్కొక్క కేసు నమోదైనట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్, 10 నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని అంటున్నారు అధికారులు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 56 కు చేరింది. అటు విశాఖ జిల్లాలోనూ కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీరంతా కూడా మర్కజ్ సదస్సులో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. శాంతినగర్ కు చెందిన 51 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నమోదు కాగా అక్కయ్యపాలెంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. iti జంక్షన్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇంకా ఫలితం తేలాల్సిన కేసులు 71 ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు 10 కి చేరుకున్నాయి. నగరంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విశాఖ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ముఖ్యామంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com