ఝార్ఖండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు

ఝార్ఖండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు
X

దేశంలో కరోనా వైరస్ విజృభిస్తుంది. ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ఝార్ఖండ్ రాష్ట్రంపై కూడా పడింది. రాష్ట్ర రాజధాని రాంచీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. మలేషియా దేశస్తురాలికి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. మలేషియా నుంచి భారత్‌కు వచ్చిన మహిళ లాక్‌డౌన్ విధించడంతో.. 24 మందితో కలిసి ఓ మసీదులో నివాసం ఉంటుంది.

అయితే ఆమెకు తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను ఖేల్ గావ్‌లోని హాస్పటల్‌కి తరలించారు. ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి నితిన్ మదన్ కులకర్ణి వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు.

Tags

Next Story