జియో ఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్..

జియో ఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్..
X

కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పలు టెలికాం కంపెనీలు వినియోగదారులు ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా రిలయెన్స్ జియో తన వినియోగదారులకు ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే వినియోగదారుల ప్రీపెయిడ్ వ్యాలిడిటీ పూర్తయినప్పటికీ వారికి ఏప్రిల్ 17 వరకు ఇన్‌కమింగ్ కాల్స్ సేవలు అందజేస్తామని తెలిపింది. ఆఫ్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే వీలు లేనందును ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ప్రకటించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని పరిశీలించాలని టెల్కోలను టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశించింది.

Tags

Next Story