ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం

ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం
X

ప్రపంచ దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వణికిపోతున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా వైరస్ సంక్రమణ రోజురోజుకు పెరుగుతూ పోతోంది. దాంతో ఎవరికీ వారు ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. సెలబ్రిటీలు, బిజినెస్ దిగ్గజాలు కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు యడియూరప్ప బుధవారం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అందరూ కరోనా పోరుకు సహకరించాలని పేర్కొన్నారు.

'ఇప్పుడు మనం చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి కరోనా మహమ్మారితో పోరాడాలి. వ్యక్తిగతంగా, నేను నా ఏడాది జీతాన్ని ముఖ్యమంత్రి సహాయకనిధికి ఇస్తున్నాను. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. మీకు తోచిన సహయం చేయమని అభ్యర్థిస్తున్నాను' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు యడ్యూరప్ప.

Tags

Next Story