క్రెడిట్ కార్డులకు మారటోరియం

మార్చి 27 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా అన్ని రుణ సంస్థలు తమ రుణగ్రహీతలకు టర్మ్ లోన్‌లపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని ఇవ్వాల్సి ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. అయితే మొదట్లో బ్యాంకులకే ఈ విధానాన్ని వర్తింపజేసిన సంస్థలు ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డులకు కూడా వర్తింపజేసింది. ఇందులో sbi , hdfc బ్యాంకుల క్రెడిట్ కార్డు దారులకు మారటోరియం అవకాశం కల్పించింది. అయితే ఈ సౌకర్యం పొందటానికి గాను కొన్ని షరతులను కూడా విధిస్తోంది.

అన్ని రిటైల్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ బకాయిలు మరియు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణాలపై మార్చి 01 లేదా అంతకు ముందు చెల్లింపులు క్రమం తప్పకుండా ఉంటేనే తాత్కాలిక నిషేధానికి అర్హులుగా భావిస్తారు. అంతేకాదు.. కార్డుపై కాంట్రాక్ట్ రేటు ప్రకారం వడ్డీ వసూలు చేయబడుతుంది. 3 నెలల తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకోవడం క్రెడిట్ కార్డ్ బకాయిలు మరియు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపును 31 మే 2020 వరకు వాయిదా వేయడానికి అనుమతిస్తుంది. దీని కోసం వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Next Story