అత్యంత విషాదం.. అమెరికాలో ఆరు వారాల చిన్నారి కరోనాతో..
By - TV5 Telugu |2 April 2020 4:16 PM GMT
ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. చిన్నారులకు, వృద్ధులకు ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. ఇప్పుడు అదే నిజమవుతోంది. అసలే అమెరికాను కరోనా అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడి ఆరు వారాల చిన్నారి మరణించినట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ నెడ్ లామోంట్ తెలిపారు. నవజాత శిశువుకు కోవిడ్ 19 పాజిటివ్ అని గత రాత్రి పరీక్షలో తేలిందని లామోంట్ చెప్పారు. ఇది ఖచ్చితంగా హృదయ విదారకం. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన అతి పిన్న వయస్కుల్లో ఇది ఒకటి అని ఆయన అన్నారు. అగ్రరాజ్యంలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెంది ఇప్పటికే 4,476 మరణాలకు కారణమైందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com