కరోనా కట్టడికి టిక్‌టాక్ భారీ విరాళం

కరోనా వైరస్ కట్టడికోసం ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ యాప్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో భారీ సాయం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్ సూట్‌లు, రెండు లక్షల మాస్కు లు సమకూరుస్తున్నట్టు టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ఇలా పేర్కొన్నారు.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు మరియు సహాయక వైద్య సిబ్బంది ముందంజలో ఉన్నారు.
భారత వైద్య సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని టిక్ టాక్ 400,000 హజ్మత్ వైద్య రక్షణ సూట్లను మరియు 200,000 మాస్కులను విరాళంగా ఇస్తోంది. ఈ పోరాటంలో ప్రపంచ ఆరోగ్య సమాజానికి సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేయడం చాలా అవసరం అని మేము నమ్ముతున్నాము.' కాగా వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని టిక్ టాక్ అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com