చిత్తూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

X
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ ల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెల 18 , 19న ఢిల్లీలోని జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు 46 మంది ఉన్నారు. వీరందరిని తిరుపతిలోని రుయా క్వారంటైన్ కు తరలించారు. అయితే అందులో 15 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత చెన్నై,
బెంగుళూరుకు వెళ్లి అక్కడ కూడా ప్రార్ధనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. మరోవైపు తిరుపతి నుంచి మరో 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. వారికోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
