వారం రోజుల్లో రెండు కరోనా ఆసుప్రతులను నిర్మించిన ఒడిశా సర్కార్

వారం రోజుల్లో రెండు కరోనా ఆసుప్రతులను నిర్మించిన ఒడిశా సర్కార్
X

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వైరస్ బాధితులకు చికిత్స అందజేయడం కోసం ప్రత్యేకంగా హాస్పిటల్‌ను నిర్మించింది. కేవలం 7 రోజుల్లోనే రెండు ప్రత్యేక కోవిడ్-19 హాస్పటల్‌లను నవీన్ పట్నాయక్ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం ప్రారంభమైన ఈ రెండు ఆసుపత్రుల్లోనూ మొత్తం 650 పడకలు ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యం కన్నా ముందుగానే వీటిని ప్రారంభించడం విశేషం.

ఏప్రిల్ 5నాటికి కటక్‌లో మరొక 500 పడకల కోవిడ్-19 ఆసుపత్రి ప్రారంభించనున్నారు. ఇది కూడా ప్రారంభమైతే దేశంలో 1,150 పడకలు కల ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రులు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఒడిశా రికార్డు సృష్టిస్తుంది.

Tags

Next Story