ఇది జోక్ చేసే సమయమా.. వర్మపై నెటిజన్స్ ఫైర్

ఇది జోక్ చేసే సమయమా.. వర్మపై నెటిజన్స్ ఫైర్
X

పేరుకి పెద్ద డైరెక్టర్. ఏ సమయంలో ఎలా స్పందించాలో తెలియదు. కరోనా వైరస్‌తో జనాలు చచ్చిపోతుంటే.. ఇంట్లో కూర్చుని చెత్త ట్వీట్లు పెట్టి నెటిజన్స్ చేతిలో చీవాట్లు తినడం రాంగోపాల్ వర్మకు బాగా అలవాటు. ముందు తనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించినట్లు పోస్ట్ పెట్టారు. అది చూసి నెటిజన్స్ నిజమే అనుకుంటారని అనుకున్నారో ఏమో.. వెంటనే ఏప్రిల్ ఫూల్ అని మళ్లీ పోస్ట్ పెట్టారు.

అసలే నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న వర్మ ఫ్యాన్స్ ఈ విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయారు. దేశం మొత్తం వైరస్‌తో పోరాడుతుంటే బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో అసహ్యకరమైన పోస్టులు పెట్టి అపహాస్య పాలవుతున్నారని వర్మపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ వ్యక్తిపై ఎవరైనా కేసు పెట్టగలరా అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. మీరు నిజంగా అనారోగ్యంతో ఉన్నారు. లేకపోతే ఇలానా పోస్టులు పెట్టేది అని మరో యూజర్ రాసుకొచ్చారు. వైరస్ బారిన పడి ఊపిరి పీల్చుకోలేక నానా ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరు జీవితంతో పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇది మీకు తగునా అని మరికొందరు తిడుతున్నారు.

మీకు వైరస్ పాజిటివ్ అన్నారు. అది నిజం కాకూడదని కోరుకుంటున్నాను అని ఓ యూజర్ రాశారు. అయినా ఈ మధ్య కాలంలో మీ సినిమాలు రావట్లేదు కదా. ఖాళీగా ఉండేసరికి మీ జీవితంలో ఉన్న హ్యుమానిటీని కోల్పోయినట్లున్నారు అని మరొకరు రాశారు. ఇలా అందరూ చీవాట్లు పెట్టేసరికి అలా ట్వీట్ చేసినందుకు క్షమించండి అని వర్మ నెటిజన్స్‌ని వేడుకున్నారు. పెద్దలు మాట్లాడితే అర్ధవంతంగా, ఆలోచించే విధంగా ఉండాలి. లేదంటే మాట్లాడకుండా వుండడం బెటర్ అని వర్మ ఎప్పుడు తెలుసుకుంటారో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story