2 April 2020 2:03 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఇప్పటికైనా...

ఇప్పటికైనా మేలుకున్నారు సంతోషం.. ఆ జంతువులపై నిషేధం

ఇప్పటికైనా మేలుకున్నారు సంతోషం.. ఆ జంతువులపై నిషేధం
X

కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ కవితలాగా.. కనిపించిన కుక్క, నక్క, పిల్లి అన్నింటిని కరకరా నమిలేయడంతో కరోనా వచ్చి ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తోంది. మంచేమో కాని చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుందనే దానికి రుజువుగా ఈ వైరస్ కారణంగా నిమిషాల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చైనాలో 3 వేల మంది బలయ్యారు. 81 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ 203 ప్రపంచ దేశాలకు విస్తరించింది. వైరస్ బారిన పడ్డ దేశాలన్నీ చైనాను వేలెత్తి చూపుతుంటే కొంచెమైనా పశ్చాత్తాపుతున్నట్లుంది. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా తినడం మానేద్దామని నిర్ణయించుకున్నట్లుంది. ఈ మేరకు చైనాలోని షెన్‌జెన్ సిటీలో పిల్లులు, కుక్కలు, బల్లులు, పాముల విక్రయంపై నిషేధం విధించారు. మే 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతాయి. అయితే ఈ చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కోళ్లు, కుందేళ్లు, బాతులు, పావురాలు, పిట్టలను మినహాయించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. ఏమోలే, ముందు ముందు మరిన్ని వింత వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కొంతలో కొంత బెటర్.

Next Story