కరోనాతో పాటల రచయిత, గాయకుడు మృతి

గ్రామీ అవార్డు గ్రహీత.. పాటల రచయిత, గాయకుడు ఆడమ్ ష్లెసింగర్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత అయిన ఆడమ్ ష్లెసింగర్ పాప్ రాక్‌బాండ్ ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ సహ వ్యవస్థాపకుడు.
52 ఏళ్ల ఆడమ్ మరణించిన విషయాన్ని నటుడు టామ్ హంక్స్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఆడమ్ ష్లెసింగర్ లేకుండా ప్లేటోన్ ఉండదు. అతడు కోవిడ్-19 చేతిలో ఓడిపోయాడు. ఇది విచారకర రోజు’అంటూ తన ట్వీట్‌లో వెల్లడించారు.
ఆడమ్ ష్లెసింగర్ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ అనే రాక్ బ్యాండ్‌ను స్థాపించారు. ఇక హాంక్స్ చిత్రం దట్ ధింగ్ యుడు అనే చిత్రానికి పాటల రచయితగా పని చేశారు. ఈ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నారు ఆడమ్. 2009 లో ‘ఎ కోల్బర్ట్ క్రిస్మస్’కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.
There would be no Playtone without Adam Schlesinger, without his That Thing You Do! He was a One-der. Lost him to Covid-19. Terribly sad today. Hanx
— Tom Hanks (@tomhanks) April 2, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com