3 April 2020 3:30 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కోవిడ్ కారణంగా ప్రముఖ...

కోవిడ్ కారణంగా ప్రముఖ బ్రిటిష్ హాస్యనటుడు మృతి

కోవిడ్ కారణంగా ప్రముఖ బ్రిటిష్ హాస్యనటుడు మృతి
X

ప్రముఖ బ్రిటిష్ హాస్యనటుడు ఎడ్డీ లార్జ్(78) కరోనావైరస్ కారణంగా కన్నుమూశారు. లార్జ్ కుమారుడు ర్యాన్ మెక్‌గిన్నిస్ ఫేస్‌బుక్‌లో తండ్రి మరణ వార్తను పంచుకున్నారు, తన తండ్రి గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు, ఆసుపత్రిలో వైరస్ బారిన పడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున మా నాన్న కన్నుమూసినట్లు అమ్మ మరియు నేను ప్రకటించాల్సిన అవసరం రావడం చాలా బాధ కలిగిస్తోంది. నాన్న కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్నారు.. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, కరోనావైరస్ సంక్రమించింది..

నాన్న ఇంతకాలం ధైర్యంగా పోరాడారు. ఈ భయంకరమైన వ్యాధి కారణంగా మేము అతనిని ఆసుపత్రిలో సందర్శించలేకపోయాము, కాని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులందరూ ప్రతిరోజూ మాట్లాడుతున్నారు.. చివరికి తుదిశ్వాస విడిచారు అని తెలిపారు. గ్లాస్గోలో జన్మించిన ఎడ్డీ లార్జ్ అసలు పేరు ఎడ్వర్డ్ మెక్గిన్నిస్.. ఎడ్డీ లార్జ్ మృతిపట్ల పలువురు హాలీవుడ్ నటులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.

Next Story