స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ ఇంటి నుంచే రాయొచ్చు..

స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ ఇంటి నుంచే రాయొచ్చు..

కరోనా వైరస్ కారణంగా అనేక మంది విద్యార్థుల పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశీ యూనిర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు నిర్వహించే టోఫెల్, జీఆర్‌ఈ పరీక్షలను ఇంటి నుంచి రాసే వెసులు బాటు కల్పిస్తామని టోఫెల్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గోపాల్ శుక్రవారం చెప్పారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్ మినహా మిగతా దేశాల విద్యార్థులందరూ ఇంటి నుంచే పరీక్ష రాయొచ్చని ఆయన తెలిపారు. అయితే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ.. రియల్ టైమ్ హ్యూమన్ మానిటరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ రెండింటినీ ఉపయోగించి పరీక్షలను నిర్వహిస్తామని గోపాల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story