లాక్ డౌన్ ను పట్టించుకోని జనం

X
By - TV5 Telugu |3 April 2020 3:12 PM IST
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా.. మహబూబాబాద్ జిల్లాలో కొందరు ఈ ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదుగురు వ్యక్తులు కలిసి ఉండొద్దని అధికారులు ఘంటాపధంగా చెబుతున్నా నరసింహులు పేట మండలం, గాజుకుంటా చెరువులో కొందరు చేపల వేటకు వెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 వందల మంది చెరువులో చేపలు పట్టారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వారు చేపల వేటకు వెళ్లడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాదిమంది చేపలవేటకు వెళ్లినా పోలీసులు పట్టించుకోకపోవడంపై ఊరిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com