బయోపిక్‌లో సమంత!!

X
By - TV5 Telugu |3 April 2020 2:54 AM IST
టాలీవవుడ్ బ్యూటీ అక్కినేని సమంత ఓ బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతోంది. ఈ పాత్ర ముందు అనుష్క దగ్గరకు వెళ్లినా ఆ తరువాత సమంతను చేరింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న సమంతకు ఈ క్యారెక్టర్ ఓ ఛాలెంజింగ్ రోల్ లాంటిది. అందుకే ఆమెను ఎంచుకున్నారు చిత్ర యూనిట్. మహానటి, ఓ బేబి, మజిలీ లాంటి చిత్రాలు తన నటనలోని పరిపూర్ణతకు అద్దం పడతాయి. కాగా, నాగరత్నమ్మ దేవదాసీగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారారు. తన సంపదనంతా కళలకు, కళాకారులకు ధారపోశారు. ఆమె పాత్రకు సమంతను ఎంపిక చేశారు. అయితే దీనిపై సమంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com