లాక్డౌన్తో నిలిచిపోయిన మహిళా క్రికెటర్ పెళ్లి

X
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో స్వైర విహారం చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా మహిళా క్రికెటర్ పెళ్లి నిలిచిపోయింది. దక్షిణాఫ్రికాలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆ జట్టు మహిళా ఓపెనర్ లిజెల్లీ లీ వివాహం నిలిచిపోయింది.
తన ప్రియుడు తాంజా క్రోనేతో ఏప్రిల్ 10న లిజెల్లీ వివాహం జరగాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో 21 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుంది. లిజెల్లీ వివాహం జరగాల్సిన రోజు.. లాక్డౌన్లో 15వ రోజుగా ఉండడంతో వివాహం నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఎర్మెలాలో నివసిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
