ఏపీలో శనివారం నుంచి నగదు పంపిణీ : డిప్యూటీ సీఎం

ఏపీలో శనివారం నుంచి నగదు పంపిణీ : డిప్యూటీ సీఎం

ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ప్రజ‌లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ప‌రంగా అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ‌వాణి తెలిపారు. క‌రోనా నియంత్రణ‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన నేప‌థ్యంలో పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా తెల్ల రేష‌న్‌ కార్డు క‌లిగి ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.1000 అంద‌జేయనుందన్నారు. శనివారం నుంచి నగదు పంపిణీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆమె వెల్లడించారు.

కాగా, తెలంగాణలో నిత్యావసరాల సరకుల కొనుగోలు కోసం తెల్లరేషన్ కార్డు దారులకు రూ.1500 అందించనున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని తెలంగాణ సర్కార్ అందజేస్తుంది.

Tags

Next Story