భారత్ నుంచి డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులను పరిమితం చేసిన ప్రభుత్వం

భారత్ నుంచి డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులను పరిమితం చేసిన ప్రభుత్వం

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్ నుంచి డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులకు ప్రభుత్వం శనివారం అడ్డుకట్ట వేసింది. "డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతి (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) ని కరోనా వైరస్ ప్రభావంతో తక్షణమే పరిమితం చేయబడింది" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఒక నోటిఫికేషన్లో తెలిపింది.

రోగుల పరీక్ష కోసం ఈ వస్తు సామగ్రి అవసరం కాబట్టి ఈ చర్య COVID-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంతకుముందు, ఈ ఉత్పత్తుల ఎగుమతులను ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించారు. ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో పరిమితులు విధించారు.కాగా ప్రపంచంలో డయాగ్నొస్టిక్ కిట్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story