ఏపీలో 180కి చేరిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఏపీలో 180కి చేరిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు.. రాష్ట్రంలో నిన్న రాత్రి 10:30 నుంచి ఇవాళ ఉదయం 10 వరకు కొత్తగా 16 కేసుల నమోదు అవ్వటంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన అఫీషియల్ ట్విట్టర్ లో అధికారులు పేర్కొన్నారు.

ఇక నిన్న ఉదయం 10 నుంచి రాత్రి 10:30 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో, తూర్పు గోదావరి జిల్లా లో 2, విశాఖపట్నం లో ఒక పాజిటివ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. శ్రీకాకుళం 0, విజయనగరం 0, విశాఖపట్నం 15, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 15, కృష్ణా 27, గుంటూరు 23, ప్రకాశం 18, నెల్లూరు , కడప 23, కర్నూల్ , చిత్తూరు 10, అనంతపురం 2 గా ఉన్నాయి.

Tags

Next Story