రాజస్థాన్ లో 191కి పెరిగిన కరోనా కేసులు

రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల 191 కి చేరుకుంది. అలాగే ఎటువంటి ప్రయాణ చరిత్ర లేని 60 ఏళ్ల మహిళ కోవిడ్ కారణంగా శనివారం రాజస్థాన్‌లోని బికానెర్‌లోని ఆసుపత్రిలో మరణించింది. ఇక తబ్లిఘి జమాత్‌తో సంబంధం ఉన్న ఎనిమిది కేసుల్లో ఆరు ఝున్ ఝును లో, రెండు చురు జిల్లాకు చెందినవి అని ఆయన చెప్పారు. మిగిలిన నలుగురిలో ముగ్గురు బన్స్వారా, ఒకరు భిల్వారాకు చెందినవారు.
మొదట బన్స్వారాలో ముగ్గురుకి నెగెటివ్ గా వచ్చింది.. అయితే శనివారం మోరోసారి పరీక్షించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ అని వచ్చిందని ఆయన చెప్పారు. భిల్వారాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో OPD రోగికి కరోనావైరస్ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు, దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 191 కి పెరిగిందని అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com