బాధ్యతను మరింత పెంచిన ప్రశంస

బాధ్యతను మరింత పెంచిన ప్రశంస
X

లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లలో ఉన్నారు. కానీ ఇప్పుడే వారికి పని మరింత ఎక్కువైంది. ఎవరినీ బయటకు రాకుండా చూడాలి. వచ్చిన వారికి రావొద్దని చెబుతూనే వస్తే వచ్చే నష్టాలేంటో వివరించాలి. మరింత బాధ్యతగా పని చేయాలి. ఇంట్లో శుభకార్యం జరిగినా విధులకు రాక తప్పని పరిస్థితి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సాయి కిషన్‌కి రెండ్రోజుల క్రితమే బాబు పుట్టాడు. అయినా డ్యూటీ చేస్తున్నారని తెలుసుకుని సీపీ అంజనీ కుమార్ అతడిని ప్రశంసించారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులకు హాజరైన అతడిని మెచ్చుకున్నారు. స్వీట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సీపీ స్వయంగా వచ్చి మెచ్చుకునే సరికి కానిస్టేబుల్ ఆనందానికి అవధుల్లేవు. ఈ ప్రశంస తన బాధ్యతను మరింత పెంచిందని సాయికిషన్ తెలిపారు.

Tags

Next Story