సినీ కార్మికుల కోసం అందాల తార నయనతార విరాళం

సినీ కార్మికుల కోసం అందాల తార నయనతార విరాళం

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుంది. ఈ మహమ్మారి సినీ పరిశ్ర‌మ‌ని కూడా తీవ్రంగా కుదిపేస్తుంది. దిన‌స‌రి వేత‌నం పొందే కార్మికులు లాక్ డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో వారికి రోజుగ‌డవ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల‌ని ఆదుకునేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా అందాల తారా నయనతార కూడా తన వంతు సాయం అందించారు. ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు చెక్కును అందించారు.

Tags

Read MoreRead Less
Next Story