కరోనా ఎఫెక్ట్.. కస్టమర్లందరూ ఒకేసారి రాకుండా బ్యాంకు ముందు..

కరోనా ఎఫెక్ట్.. కస్టమర్లందరూ ఒకేసారి రాకుండా బ్యాంకు ముందు..
X

ఆహా.. ఎప్పటికీ ఇలానే మెయింటైన్ చేస్తే ఎంత బావుండు.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఒక ఊరి ఎస్‌బీఐ బ్యాంకు ముందు గీతలు గీసి, అందులో కుర్చీలు వేసి మరీ కస్టమర్లను కూర్చోబెట్టారు. ఒకరి తరువాత ఒకరు వచ్చి మీ బ్యాంకు పనులు చేసుకోమంటూ పెట్టిన ఈ రూల్ అందరికీ నచ్చింది. ఎస్‌బీఐ బ్రాంచ్‌లు ఉన్న అన్ని ఊర్లలో ఇదే విధంగా ఏర్పాటు చేశాయి బ్యాంకు యాజమాన్యాలు.

కంటికి కనిపించడం లేదు కాని.. కరోనాను చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరోనా వచ్చింది మనకు చాలా నేర్పింది. ఎక్కడికి వెళ్లినా ఎంత రష్. ఒకరి మీద ఒకరు పడి.. తోసుకుంటూ, రాసుకుంటూ.. సూపర్ మార్కెట్లో, బస్టాపులో, సినిమా థియేటర్లో, షాపింగ్ మాల్లో, కూరగాయల మార్కెట్లో, ఆఖరికి బ్యాంకుల్లో ఎక్కడ చూసినా జనం.. జనం. ఎవరికి ఏమున్నాయో ఎవరికీ తెలియదు.. దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా కనీసం కర్ఛీఫ్ కూడా అడ్డుపెట్టుకోకుండా ఎదుటి వారి మీద హాచ్ అంటూ పని కానిచ్చేయడమే.

కరోనా వల్ల సామాజిక దూరాన్ని పాటించండి అంటూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రూల్ ఏదో బావుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించమనడం, చేతులు తరచూ శుభ్రపరచుకోమనడం, ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాపించకుండా ముక్కుకి, నోటికి మాస్క్ కట్టుకోమనడం అన్నీ మంచి అలవాట్లే. ఆఖరికి చదువుకున్నవారు కూడా అలక్ష్యం చేసే శుభ్రతని ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నేర్పింది. అందరికీ ఒకటే రూల్ అలవాటు చేసింది. ఈ వైరస్ ఎటు వైపు నుంచి వచ్చి ప్రాణాలు తీస్తుందో తెలియకుండా ఉంది. చేసేదేమీ లేదు.. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే సరి.

Tags

Next Story