థ్యాంక్యూ మేడమ్.. పారిశుధ్యకార్మికురాలిని అభినందించిన విద్య.. వీడియో

లాక్‌డౌన్ కారణంగా దేశంలోని సగం జనాభాకు పైగా ఇళ్లలో గడుపుతున్నారు. కానీ వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది మాత్రం మనకు సేవ చేయడానికి రోడ్డు మీద ఉన్నారు. వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం పని చేస్తున్నారు. వారందరికి నా కృతజ్ఞతలు అని బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపారు. ముంబైలోని ఓ పారిశుధ్య కార్మికురాలు రోడ్డు మీద చెత్తను శుభ్రం చేస్తుంటే, ఆమెను తన ఇంటి బాల్కనీలో నుంచి చూసిన విద్య.. మేడమ్ థ్యాంక్యూ అంటూ గట్టిగా అరిచింది. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అని ఆమెకు చెప్పింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ విద్యాబాలన్‌ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram
Vidya being Vidya...!🥰🥰👌👍 #bollywood
A post shared by Vidya Balan Fan (@vidyabalanfan) on
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com