5 April 2020 10:55 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అమెరికాలో మూడు లక్షలు...

అమెరికాలో మూడు లక్షలు దాటినా కరోనా కేసులు

అమెరికాలో కరోనావైరస్ కరల నృత్యం చేస్తోంది. కేసులు మూడు లక్షలకు పైగా నమోదయ్యాయి. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం.. కేసుల సంఖ్య 300,000 దాటింది, అలాగే మరణాల సంఖ్య 8,100 కు చేరుకుంది. ఇదిలావుంటే ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 3,565 మంది మరణించారు.. అంతకుముందు రోజు 2,935 మంది మరణించారు. మరోవైపు కరోనావైరస్ కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

Next Story