ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరిస్థితిపై శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10 మందికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 190కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో-5, గుంటూరులో-3, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్క కేసు నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 32కు చేరింది. కృష్ణా-27, కడప-23, ప్రకాశం-24, గుంటూరు-16, విశాఖ-15, పశ్చిమ గోదావరి-15, తూర్పుగోదావరి-11, చిత్తూరు-10, కర్నూలు-4, అనంతపురం-3 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Next Story