బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాస్పటల్కి తరలింపు

X
కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆదివారం హాస్పటల్కి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్లో ఉన్నారు. బోరిస్ జాన్సన్ కు కరోనా తగ్గుముఖం పట్టక పోవడంతో ముందుజాగ్రత్త చర్యగా అతన్ని హాస్పటల్కి తీసుకెళ్లామని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. జాన్సన్ వ్యక్తిగత డాక్టర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అయితే బ్రిటన్లో 24 గంటల్లో 5,903 కేసులు పెరిగినట్లు ఆదివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకినవారి సంఖ్య 47,806కు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కాటుకి 621 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,914కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
