రాజీవ్‌ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల మృతి

రాజీవ్‌ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల మృతి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల చెల్లెలు, బుల్లితెర నటి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె భర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ పెద్ది రామారావు..

ఈయన జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత వ్యక్తి. కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. శ్రీలక్ష్మికి ఇద్దరు సంతానం . ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటించి మంచి నటిగా గుర్తింపుపొందారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా రాజీవ్‌ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story