మేడమ్.. మీకోసం ప్రేమతో ఈ వీడియో..

మేడమ్.. మీకోసం ప్రేమతో ఈ వీడియో..
X

గీతగోవిందం మేడమ్ రష్మిక మండన 24వ పుట్టిన రోజును ఆదివారం జరుపుకున్నారు. ఆమెకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, రాశీఖన్నా, హరిప్రియ శుభాకాంక్షలు అందించారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్లు పెట్టారు. ఓ వీరాభిమాని మాత్రం మరింత ప్రేమతో ఆమె నటించిన సినిమాల్లోని క్లిప్పింగ్స్ ‌ను తీసుకుని వీడియో రూపొందించారు. దాన్ని రష్మికకు పంపిస్తూ మేడమ్.. దీన్ని మీమీద ఇష్టంతో, గౌరవంతో ఎడిట్ చేశాను అని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. దాన్ని చూసిన రష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అదే విషయాన్ని అతడి రిప్లై ఇస్తూ.. వీడియోను బాగా ఎడిట్ చేశారు.. ధన్య వాదాలు.. నన్ను భావోద్వేగానికి గురిచేశారు... నా కళ్లలో నీళ్లు తిగుతున్నాయి అని ట్వీట్ చేశారు. కాగా, రష్మిక ప్రస్తుతం కాల్షీట్లు ఖాళీలేనంత బిజీగా ఉంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో వరుస హిట్లందుకున్న రష్మీ అల్లు అర్జున్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.

Tags

Next Story