పటేల్ విగ్రహం సేల్ @ 30 వేల కోట్లు..

పటేల్ విగ్రహం సేల్ @ 30 వేల కోట్లు..
X

కరోనా కట్టడి కేంద్రం పీఎం ఫండ్, రాష్ట్రాలు సీఎం ఫండ్లూ ఏర్పాటు చేశాయి. అయినా వైద్య పరికరాల కొరత. మరి దీన్ని పరిష్కరించాలంటే బోలెడు నిధులు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి. అందుకే కేంద్రం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్‌లో పెట్టారు. కేంద్రం ఈ విగ్రహం కోసం 3వేల కోట్ల నిధులు వెచ్చించింది.. 182 మీటర్ల ఎత్తుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.

ఇప్పటి వరకు ఈ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకుల ద్వారా రూ.82 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. మరి ఇప్పుడు దాన్ని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టడడం ఏమిటి అనుకుంటున్నారా.. అదే అసలు ట్విస్టు.. ఇది ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన పని.. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ.. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు విగ్రహాన్ని సేల్ చేస్తున్నామని పేర్కొన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని అమ్మవలసి వస్తుందని.. దీని ధర రూ.30 వేలకోట్లు అని అతడు పేర్కొన్నాడు. అయితే ఇది ఫేక్ పోస్ట్‌గా గుర్తించిన ఓఎల్ఎక్స్ వెంటనే తమ పోర్టల్ నుంచి పోస్ట్‌ను తొలగించింది. కానీ అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags

Next Story